Breaking News

BRS Party: మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

Published on Thu, 03/14/2024 - 18:43

సాక్షి, హైదరాబాద్‌: మరో రెండు లోక్‌సభ స్థానాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్‌ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది బీఆర్‌ఎస్‌.  దీంతో పార్లమెంట్‌ ఎన్నికలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేడు భేటీ అయ్యారు.. నందినగర్‌లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై చర్చించారు.  ఈఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలచారి, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. అయితే కేసీఆర్‌ సమావేశానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ భేటీలోనే రెండు పార్లమెంట్‌ స్థానాల అభ్యర్ధి ఎంపిక విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. 

ఇక గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నగేష్ ఇటీవలే బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అయిన సోయం బాపురావును కాదని కాషాయ పార్టీ నగేష్‌కు టికెట్‌ కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు లోక్ సభ టికెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది.

ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ ప్రకటించిన పార్లమెంటు స్థానాలు

1) ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ -(ఎస్టీ) మాలోత్ కవిత
3) కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్ 
4)పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్ 
5) మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి 
6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ 
7) వరంగల్ (ఎస్సీ)-డాక్టర్ కడియం కావ్య
8 ) జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్
9) నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)