Breaking News

కేసీఆర్‌ రానట్లేనా?

Published on Wed, 03/19/2025 - 10:30

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrashekar Rao) దూరంగా ఉండనున్నారా?. బడ్జెట్‌ ప్రసంగంతో పాటు సమావేశాలకూ ఆయన దూరంగా ఉంటారా?. దీనిపై బీఆర్‌ఎస్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ఈసారి బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ కచ్చితంగా హాజరవుతారని, చర్చల్లోనూ పాల్గొంటారని ఆయన తనయుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీఆర్‌ఎస్‌ శ్రేణుల హడావిడి కూడా ఏం కనిపించకపోవడం గమనార్హం. 

గవర్నర్‌ ప్రసంగం(Governor Speech) రోజున కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరు కావడంతో ఈసారి సెషన్‌ ఆసక్తికరంగా జరగవచ్చనే చర్చ నడిచింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆయన సెషన్‌ దూరంగానే ఉంటారని తెలుస్తోంది. మరోవైపు మల్లన్నసాగర్‌ నిర్వాసితులు నిన్న కేసీఆర్‌కు బహిరంగ లేఖ ఒకటి రాశారు. అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలు విన్నవించాలని.. లేకుంటే ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌ వద్ద నిరసనలు చేపడతామని అందులో హెచ్చరికలు జారీ చేశారు కూడా.

కేసీఆర్‌ చివరిసారిగా కిందటి ఏడాది బడ్జెట్‌ సమావేశాలకు హారజయ్యారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అంతా డొల్ల’ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు కూడా. 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)