Breaking News

చంద్రబాబుది సూపర్‌ సిక్స్‌ కాదు.. సూపర్‌ బాదుడు: కారుమూరి

Published on Thu, 10/10/2024 - 19:42

సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి చందాలపైనే ఆధారపడ్డారంటూ మాజీ మంత్రి  కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి చందాలు.. అన్నా క్యాంటీన్‌లకు చందాలు.. చివరికి వరదల్లో కూడా చందాలే అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

విజయవాడ వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. వరదల్లో కేవలం ఆకలితో అలమటించి 30 మందిపైగా మరణించారన్నారు. రాష్ట్రమంతటా కూడా చిన్నపిల్లలను కూడా వదలకుండా  వందల కోట్లు చందాలు వసూలు చేశారు. చందాలు, కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

‘‘వరద బాధితుల సాయంలో కూడా పెద్ద ఎత్తున దోచుకొంటున్నారు. మా ప్రభుత్వం హాయాంలో టీడీపీ వాళ్లు బాదుడే బాదుడు అంటూ ఇళ్ల చుట్టూ తిరిగారు. ఇప్పుడు కూటమి సర్కార్‌ సామాన్యుడు నడ్డి విరిగేలా నిత్యావసరాల ధరలు పెంచటాన్ని ఏమనాలి?. చంద్రబాబుది సూపర్‌ సిక్స్‌ కాదు.. సూపర్‌ బాదుడు అనుకుంటున్నారు. కూరగాయలు ఆకాశాన్నంటాయి. గత ప్రభుత్వంలో ఏమైనా ధరలు పెరిగితే  రైతు బజార్లు ద్వారా సబ్సిడీకి అందించేవాళ్లం. గతంలో మేము ఇసుకను ప్రభుత్వానికి ఆదాయం కల్పించి సామాన్యులు  కొనేలా అందించాం.. కానీ ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో భారీ కుంభకోణానికి  తెరలేపారు’’ అని కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది : వైఎస్‌ జగన్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)