Breaking News

సీబీఐ విచారణ.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Published on Thu, 09/26/2024 - 16:54

బెంగళూరు: మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) స్కాం కేసులో సీఎం సిద్దరామయ్య విచారణను ఎదుర్కొనున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను అనుమతిస్తూ గతంలో మంజూరు చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయించింది.

కుంభకోణం కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సీఎంపై సీబీఐ విచారణను నిరోధించడానికే కాంగ్రెస్‌ సర్కార్‌ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే సీబీఐ పక్షపాతంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకునన్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. సీఎం సిద్దరామయ్య ఎదుర్కొంటున్న భూ కుంభకోణం ఆరోపణలకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థ దుర్వినియోగానికి గురవుతోంది. పక్షపాతంతో వ్యవహరిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని తెలిపారు. 

కాగా ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్‌ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్‌ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్‌ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది.  కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది.

అనంతరం ఈ కుంభకోణంలో  సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్‌ 156(3) కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్‌ 24 లోగా విచారణ నివేదికను కోర్టుకు అందజేయాలని పోలీసులకు సూచించింది.

ఇదిలా ఉండగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం.. రాష్ట్రంలో నేర పరిశోధనలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు(సీబీఐ) ప్రభుత్వం గతంలో అనుమతి ఇచ్చింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)