Breaking News

కర్ణాటకలో గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

Published on Mon, 06/26/2023 - 13:52

కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఐదు ప్రధాన వాగ్దానాల్లో గృహ జ్యోతి కూడా ఒకటి. ఈ పథకం కింద లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సబ్సీడీ అందించనుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు పథకానికి అర్హులైనవారిని ఆన్లైన్లోనూ, ఆఫ్ లైన్లోనూ దరఖాస్తు చేసుకోవాలని కోరింది.      

ఆహారం, విద్య, ఆరోగ్యం తోపాటు ఇతర నిత్యావసరాల ధరలు మిన్నంటుతున్న నేపథ్యంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత విద్యుత్ సబ్సీడీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మిగతా నాలుగు వాగ్దానాలతో పాటు ఉచిత విద్యుత్ సబ్సీడీ పాచిక కూడా పారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సొంతం చేసుకుంది.   

ఎన్నికల్లో చెప్పినట్లుగానే కర్ణాటక ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించనుంది. జూన్ 18 న మొదలైన దరఖాస్తు ప్రక్రియలో ఇప్పటికే 51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 

సగటు నెలవారీ వినియోగం కంటే విద్యుత్తు వినియోగం తక్కువగా ఉన్న వినియోగదారులు అందరూ ఈ పథకానికి అర్హులేనని.. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించుకునే వారికందరికీ ఈ సబ్సీడీ లభిస్తుందని.. 200 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించుకునేవారు మాత్రం పూర్తి బిల్లును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. 

దరఖాస్తు చేసుకోవడమెలా? 
కర్ణాటక సేవాసంధు పోర్టల్ లోకి వెళ్లి కరెంటు బిల్లులో ఉన్నట్లుగా ఆధార్ కార్డు, కస్టమర్ ఐడి స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చెయ్యాలి. ఆఫ్లైన్లో కూడా గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. "బెంగుళూరు వన్", "గ్రామ వన్", "కర్ణాటక వన్" సెంటర్లకు వెళ్లి అక్కడ కూడా  నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది కర్ణాటక ప్రభుత్వం.  

ఇది కూడా చదవండి: డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)