Breaking News

వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలన్న కంగనా.. కాంగ్రెస్‌ కౌంటర్‌

Published on Tue, 09/24/2024 - 19:24

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తన దురుసు వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ఈ చట్టాలు తిరిగి అమలు చేసేందుకు రైతులే డిమాండ్ చెయ్యాలని తెలిపారు.

ఈ మేరకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గం మండిలో ఆమె మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం తిరిగి తీసుకురావాలని కోరారు. ‘ఈ ప్రకటన వివాదాస్పదమని నాకు తెలుసు. కానీ మూడు వ్యవసాయ చట్టాలు తిరిగి అమలు చేయాలి. ఇందుకు రైతులు స్వయంగా డిమాండ్‌ చేయాలి. 

ఈ చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాల నిరసనల కారణంగా ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేశాభివృద్ధిలో రైతులే మూల స్థంభం. వారి ప్రయోజనాల కోసం చట్టాలను తిరిగి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

అయితే కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ ఎప్పటికీ అది జరగనివ్వదని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే మాట్లాడుతూ.. ‘మూడు నల్ల రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ 750 మందికి పైగా రైతులు అమరులయ్యారు. వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము దీనిని ఎప్పటికీ అనుమతించం’ అని పేర్కొన్నారు.

కాగా 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు 2020 నవంబరు 26 నుంచి నిరసనలు మొదలుపెట్టారు. ఆందోళనల్లో అనేక రైతు సంఘాలు పాల్గొన్నాయి.  

ఎట్టకేలకు ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూ 2021 నవంబరు 19న దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. వ్యవసాయ చట్టాలను  వెనక్కి తీసుకుంటూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. అనంతరం ఈ నేపథ్యంలో తమ నిరసనలను రైతులు నిలిపివేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)