వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా ‘దుర్గం’ ఎమ్మెల్యే అమిలినేని

Published on Thu, 07/30/2026 - 13:35

అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వివాదాస్పద వైఖరిపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలిసింది. అక్రమ వ్యవహారాలపై నివేదికలు సేకరించినట్లు టీడీపీ నాయకుల్లోనే చర్చ సాగుతోంది.  

  • అధికారంలోకి వచ్చాక వివాదాల     పర్వంలో మచ్చుకు... 
    నెల క్రితం శింగనమల మండలంలోని సి. బండమీద పల్లి సమీపంలో  వైఎస్సార్‌సీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి వాహనాన్ని రాంగ్‌ రూట్‌లో వచ్చిన టిప్పర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ ఎమ్మెల్యే అమిలినేనికి చెందిన ఎస్‌ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్‌దిగా గుర్తించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిని కప్పిపుచ్చేందుకు కుట్రలకు తెరలేపడం చర్చనీయాంశమైంది.   

    ఐదు నెలల క్రితం అన్నమయ్య జిల్లాలోని గండ బోయిన పల్లి టోల్‌ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు హల్‌చల్‌ చేశారు. వాహనాన్ని ఆపారంటూ మహిళా సిబ్బందిపై ఏకంగా దాడికి దిగారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే టోల్‌ రుసుము కూడా కట్టలేని స్థితిలో ఉన్నారా అంటూ ప్రతిపక్షాలు అప్పట్లో దుమ్మెత్తిపోశాయి. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.  

    గత ఏడాది అక్టోబర్‌లో అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఎలైట్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు, ఆయన అల్లుడు నానా యాగీ చేశారు. అకారణంగా తమపై దాడి చేశారంటూ అక్కడి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ హరినాథ్‌ భార్య సుజాత ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.  

    గత ఏడాది జూన్‌లో ఎస్‌ఆర్‌సీకి సంబంధించి వెలుగుచూసిన ఈ స్టాంప్‌ డ్యూటీ గోల్‌మాల్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డాక్యుమెంట్‌ ఫోర్జరీ చేసి యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.900 కోట్లు, టాటా క్యాపిటల్స్‌   నుంచి మరో రూ.20 కోట్లు రుణం తీసుకున్నారు. స్టాంప్‌ డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కన్నం పడింది. తప్పుడు డాక్యుమెంట్లతో మోసం చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ కుంభకోణంపై మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త డాక్టర్‌ తలారి రంగయ్య హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, సీఐడీ, ఈడీతో విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం కేసు విచారణలో   ఉంది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం.   

    చంద్రబాబు దృష్టికి వ్యవహారం 
    అమిలినేని వివాదాస్పద వ్యవహారాలపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు నివేదికలు వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. మద్యం షాపులను బలవంతంగా లాక్కోవడం, ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో బెల్టుషాపులు నిర్వహించడం, ఇసుకను భారీ ఎత్తున అక్రమంగా తరలించడం వంటి వాటిపై కూడా నివేదికలు సేకరించినట్లు సమాచారం.  

అక్రమ కేసులతో భయపెడుతూ..
అమిలినేని తీరును, నియోజకవర్గంలో ఆయన మేనల్లుళ్లు సాగిస్తున్న అక్రమాలను ప్రశి్నస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అన్యాయాలపై ప్రశ్నించే వారిని పోలీసు యంత్రాంగం ద్వారా భయపెడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు సొంత పార్టీ నేతలను కూడా భయపెడుతున్నారనే ఆరోపణలున్నాయి.    

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)