Breaking News

కల్వకుంట్ల కవిత మరో సంచలన ట్వీట్‌

Published on Wed, 09/03/2025 - 20:24

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌, ఆపై పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, భవిష్యత్‌ కార్యచరణపై పరోక్షంగా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అందులో .. ‘నిజం మాట్లాడటానికి చెల్లించాల్సిన మూల్యం ఇది అయితే.. తెలంగాణ ప్రజలకోసం వందరెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం’ అని పేర్కొన్నారు. అయితే ఈ హరీష్‌ రావు, సంతోష్‌రావు గురించి సంచలన ఆరోపణలు చేసిన తర్వాత పార్టీలోని పరిణామాల్ని ప్రస్తావిస్తూ ఈ ట్వీట్‌ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

అంతకుముందు మాజీ మంత్రి హరీష్‌ రావు, సంతోష్‌ రావులపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ హరీష్‌ రావుకు మద్దతుగా నిలిచింది. హరీష్‌ రావు ఆరడగుల బుల్లెట్టు అంటూ వెనకేసుకొచ్చింది.

అదే సమయంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో పార్టీ ఎమ్మెల్సీ కే.కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు,కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్న అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారంటూ’బీఆర్‌ఎస్‌ అధికారిక ప్రకటన చేసింది.

ఈ క్రమంలో పార్టీ నుంచి సస్పెండ్‌ తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ తనని సస్పెండ్‌ చేయడంతో..కవిత కొత్త పార్టీని పెట్టనున్నారని,బీఆర్‌ఎస్‌యేతర పార్టీలో చేరబోతున్నారనే ప్రచారానికి పులిస్టాప్‌ పెట్టారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయోద్దని సూచించారు. ఇలా వరుస పరిణాలతో కవిత బుధవారం ఎక్స్‌లో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేయడం చర్చాంశనీయంగా మారింది. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)