Breaking News

టీడీపీ నేతల సిఫార్సు ఉంటేనే ఇసుక ఇస్తున్నారు: కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

Published on Thu, 08/29/2024 - 12:51

సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్‌ పాలనలో టీడీపీ నేతల సిఫార్సులు ఉంటేనే ఇసుక దొరుకుతుంది. లేదంటే ఇసుక దొరికే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు, భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాకాణి చెప్పుకొచ్చారు.

నెల్లూరులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఉచిత ఇసుక ఇస్తామన్న ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ రేటుకు ఇసుక అమ్ముతోంది. ట్రాన్స్‌పోర్టు ఖర్చుల పేరుతో ప్రభుత్వం ఇసుకను మూడు నాలుగు రెట్లు అధిక రేటుకు అమ్ముతున్నారు. టీడీపీ నేతల సిఫార్సు ఉంటేనే ఇసుక దొరుకుతుంది.. లేకుంటే ఇసుక దొరికే ప్రసక్తే ఉండదు.

సంగం దగ్గర ఉన్న సూరాయపాలెం ఇసుక రీచ్ దగ్గర సోమిరెడ్డి అధిక ధరకు ఇసుక అమ్మాలి అని ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగిందని చెప్తున్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జిల్లా మైనింగ్ డీడీగా ఉన్న అధికారినే ఎందుకు కొనసాగిస్తున్నారు. జిల్లాలో మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడి ఉంటే జిల్లా మైనింగ్ డీడీ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఉచిత ఇసుక విధానంలో సరైన చర్యలు తీసుకుని సరసమైన ధరలకు ప్రజలకు అందేలా చూడాలి లేదంటే ప్రజల తరఫున పోరాటాలు చేస్తాం. జిల్లా యంత్రాంగమంతా ఇసుక అక్రమార్కులకు సహకరిస్తుంది. జిల్లా ఎస్పీ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై కూడా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కాకాణి.. వైఎస్‌ జగన్ నాయకత్వాన్ని దెబ్బ తీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చివరికి 23 సీట్లకే ఆయన పరిమితం అయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తాడా?. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. గతంలో పార్టీ మారిన వారు కాలగర్బంలో కలిసిపోయారు.. పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదన్నారు.

అమాంతం పెరిగిన ఇసుక రేట్లు.. ఇదేనా చంద్రబాబు నీ పాలన..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)