Breaking News

ఈసీ మొద్దు నిద్ర.. పులివెందులలో టీడీపీ ఓట్ల చోరీ: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Published on Mon, 08/11/2025 - 14:05

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికార టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను వైఎస్సార్‌సీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎండగట్టారు. టీడీపీ నేతలు ఓటర్ల స్లిప్పులను సేకరిస్తు‍న్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన.. ఈసీ తీరుపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ..

.. పోలింగ్‌ బూత్‌లను మార్చడంపై స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. దీని వలన ఎవరి ఓటు ఎక్కడ ఉందో ఓటరికి అర్థం కాదు. తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలి.

.. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు. టీడీపీ వారు ఇంటింటికీ వెళ్ళి డబ్బులు పంచుకున్నారు. డబ్బులిచ్చి ఓటర్ల స్లిప్పులను వెనక్కు తీసుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. ఎర్రిపల్లిలో రాత్రే టీడీపీ నేతలు స్లిప్పులను తీసుకున్నారు. ఈరోజు మరికొన్ని గ్రామాలలో తీసుకోబోతున్నారు. 

.. మా పార్టీ మండల నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి స్లిప్పులు అడుగుతున్నారు. మూడురోజులుగా ఎన్నికల కమిషన్ దృష్టికి పదేపదే  తీసుకెళ్లాం. అయినా ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రతి ఒక్క ఓటరికీ మళ్లీ స్లిప్‌లను అందించాలి. ఈ రాత్రికి మొత్తం 10,601 ఓటర్లకు స్లిప్పులను ఇవ్వాలి. 

నల్లపరెడ్డిపల్లి గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు. ఆ వచ్చినవారికి ఈ స్లిప్పులను ఇచ్చి దొంగ ఓటు వేయించబోతున్నారు. ిగ్గింగ్ చేసినట్టు కెమెరాలో కనపడకుండా ఇలాగ ప్లాన్ చేశారు. నిరంతరాయంగా ఇలా దొంగ ఓట్లు వేయటానికి మనుషులను దించారు. దీనిపై మొద్దు నిద్ర వీడి.. ఎన్నికల కమిషన్ స్పందించాలి అని డిమాండ్‌ చేశారాయన. ఇదిలా ఉంటే.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్‌ మంగళవారం ఉదయం నుంచి జరగనుంది.

	Avinash Reddy: అడ్డగోలుగా పోలింగ్ బూత్ ల మార్పిడి ఇలా

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)