త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..
Breaking News
కవిత అరెస్ట్పై కేఏ పాల్ ఆసక్తికర కామెంట్స్
Published on Sat, 03/23/2024 - 11:51
సాక్షి, నల్లగొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అవుతుందని ముందే చెప్పాను అంటూ కామెంట్స్ చేశారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్. అలాగే, కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేసిన రోజునే ప్రజలు బాగుపడారని పాల్ చెప్పుకొచ్చారు.
కాగా, కేఏ పాల్ శనివారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను చాలా సార్లు కలిశారు. తెలంగాణ ప్రజలకు నీటి సమస్య తీవ్రంగా ఉంది. కేబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిని మార్చాలని నేను ఎప్పుడో చెప్పాను. కోమటిరెడ్డి వెంకట రెడ్డి చాలా మాటలు చెబుతున్నాడు. రైతుబంధు డబ్బులు ఐదువేల కోట్లు ఎటుపోయాయి. వెయ్యి కోట్లకు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయాడు.
తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కురుకుపోయింది. కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేసిన రోజున ప్రజలు బాగుపడుతారు. రేవంత్ గురువు చంద్రబాబు చెప్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తాను. లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ప్రజాశాంతి పార్టీలో పోటీలో ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Tags : 1