Breaking News

నా డబ్బుతో తెలంగాణ అభివృద్ధి చేస్తా: కేఏ పాల్‌

Published on Thu, 07/06/2023 - 16:53

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ KA Paul మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి ద్వారా తమ ఛారిటీ భూములు లాక్కున్నారని, అవినీతిని నిలదీస్తున్నందునే తనను కలవడానికి సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని అంటున్నారాయన. 

సదాశివపేట పోలీసులపై మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయంలో గురువారం ఆయన ఫిర్యాదు చేసి.. అక్కడి సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కోరారాయన. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండడానికే.. కేసీఆర్, కేటీఆర్‌లు మానవ హక్కులు కమిషన్ ఏర్పాటు చేయడం లేదు. ధరణి తీసుకువచ్చి మా ఛారిటీ భూములను లాక్కున్నాడు. కేసీఆర్‌ను కలవడానికి వెళితే నన్ను అడ్డుకున్నారు. అవినీతి మీద నేను ప్రశ్నిస్తున్న అని భయపడి నన్ను కేసీఆర్‌ కలవలేదు అని అన్నారాయన. 

ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒకటేనన్న ఆయన.. కేసీఆర్ మిత్రుడు కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడమే అందుకు నిదర్శమని చెప్పారు. అధికార బీఆర్‌ఎస్‌ తనను ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారాయన. ‘‘నేను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాను. నా డబ్బు అంతా అమెరికాలో ఉండిపోయింది. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తా’ అని చెప్పారాయన. 

గత 6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందన్న కేఏపాల్‌.. వారం రోజుల్లో వాటికి చైర్మన్ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో.. రిటైర్డ్‌ జస్టిస్ చంద్ర కుమార్‌ను మానవ హక్కుల కమిషన్ గా తాను రికమండ్‌ చేస్తానని చెబుతూ.. లైవ్‌లోనే ఆయనకు ఫోన్‌ చేసి మరీ ‘మానవ హక్కుల  కమిషన్ చైర్మన్ గా  ఉంటారా?’ అని అడిగారు.

ప్రపంచ శాంతి మహాసభలకు ఆహ్వానించేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన కేఏ పాల్‌ను.. అపాయింట్‌మెంట్‌ లేదని చెబుతూ సెక్యూరిటీ గేట్‌ బయటే అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదీ చదవండి: బీజేపీ బలం సెన్సెక్స్‌ కాదు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)