Breaking News

కాంగ్రెస్‌లో చీలికలేంటి?..

Published on Mon, 12/22/2025 - 12:13

కర్ణాటకలో పవర్‌ పాలిటిక్స్‌కు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ భేటీలతో హైకమాండ్‌ పుల్‌స్టాప్‌ పెట్టిందని భావిస్తున్న వేళ.. ఈసారి కాంగ్రెస్‌ గ్రూప్‌ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. సీఎం సిద్ధరామయ్య సన్నిహితులతో డిప్యూటీ సీఎం శివకుమార్‌ వరస భేటీలు జరపుతుండడం.. వాటిపై అధిష్టానం సీరియస్‌గా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఆ ప్రచారంపై డీకే శివకుమార్‌ ఓపెన్‌ అయ్యారు. 

కర్ణాటక కాంగ్రెస్‌ రాజకీయలపై జరుగుతున్న తాజా ప్రచారాలను సోమవారం మీడియా సాక్షిగా డీకే శివకుమార్‌ తోసిపుచ్చారు. సిద్ధరామయ్య, తాను అన్నదమ్ముల్లా పని చేస్తుంటే ఇంక కాంగ్రెస్‌లో చీలిక ఎందుకు ఉంటుందని అన్నారాయన. ‘‘సిద్ధరామయ్యతో నాకు 16 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆ బంధం ఇక మీదట కూడా కొనసాగుతుంది. అన్నదమ్ముల్లా మేం మా పని చేసుకుంటూ పోతున్నాం. అలాంటప్పుడు పార్టీలో అంతర్గత విబేధాలు.. చీలికలు ఎందుకు వస్తాయి?. అధిష్టానం ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తుంది??.. ఇది కేవలం.. మీడియా, బీజేపీ సృష్టిస్తున్న ఊహాగానాలే’’ అని అన్నారాయన.  

సీఎం సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడిగా పేరున్న మాజీ మంత్రి కేఎన్‌ రాజన్నతో ప్రత్యేకంగా భేటీ కావడంపై డీకే శివకుమార్‌ స్పష్టత ఇచ్చారు. ‘‘ఇందులో రాజకీయ కోణం ఏం లేదు. రాజన్న నాకు కూడా ఆప్తుడే. గతంలో ఎస్‌ఎం కృష్ణ హయాంలో ఆయనకు ఓ కీలక పదవి ఇప్పించా. నేను ఆయన్ని కలిసింది మర్యాదపూర్వకంగానే‘‘‘ అని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్‌లో ఏ నేతతోనూ తనకు విబేధాల్లేవని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు.

పవర్‌ షేరింగ్‌.. సీఎం సీటు కోసం ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు.. ఈ ప్రయత్నాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కథనాలపైనా డీకే రియాక్ట్‌ అయ్యారు. ‘‘నా ఢిల్లీ పర్యటనలేవీ రాజకీయ పరమైనవి కావు. ఉన్నత స్థాయి సమావేశాల్లో భాగంగానే జరిగాయి. బెంగళూరు మెట్రో ప్రాజెక్టు నిధుల కోసం, ఇతర అభివృద్ధి కోసమే నేను హస్తినకు వెళ్లా’’ అని అన్నారు. అయితే..  

కర్ణాటక అధికార కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని పార్టీ సీనియర్‌ నేత వీఆర్‌ సుదర్శన్‌ ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు ఓ లేఖ రాశారు. ఈ విషయాన్నే డీకే వద్ద స్పందించగా.. ఆ లేఖ సారాంశం వేరని.. కాంగ్రెస్‌లో లుకలుకలు నెలకొన్నాయని బీజేపీ సృష్టించిన ప్రయత్నమే ఆ ప్రచారమని కొట్టిపారేశారాయన.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)