Breaking News

ఆ రెండు రాష్ట్రాల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేస్తాం: జేపీ నడ్డా

Published on Fri, 10/11/2024 - 19:39

సిమ్లా: రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్‌  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్ చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  జోస్యం చెప్పారు. ఇవాళ (శుక్రవారం) హిమాచల్‌ ప్రదేశ్‌  రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని నైనా దేవి ఆలయంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  

‘‘ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. హర్యానా తరహాలోనే మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో  జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుంది. నేడు తీవ్రవాదం అదుపులో ఉంది. బీజేపీ పాలన కేవలం అధికారంలో రావటామే కాదు. దేశాన్ని సురక్షితంగా ఉంచేలా చూస్తుంది. ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులపై ఇది యుద్ధం సమయం కాదు. అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. అందరూ కలిసికట్టుగా నడుచుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు.

హర్యానాలో అధికారాన్ని నిలుపుకోవడానికి.. కాంగ్రెస్‌ కుట్రలు ఎదుర్కొని మరీ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక.. జమ్ము కశ్మీర్‌లో 90 సీట్లకు గాను 29 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ చెప్పుకోదగ్గ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ హయాంలో హిమాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి పనులు జరిగాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేశాం. బీజేపీ అంటే అభివృద్ధి అని చూపించాం. విభజించి పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్  పార్టీ పర్యాయపదం. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్‌ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి’’ అని అన్నారు.

 

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)