Breaking News

కాంగ్రెస్‌కు కౌంటర్‌‌.. సోనియాపై జేపీ నడ్డా విమర్శలు

Published on Sun, 12/29/2024 - 07:59

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు స్మారకం నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మాజీ ప్రధాని మన్మోహన్‌కు స్మారకం నిర్మించడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మన్మోహన్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని, స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్‌లో అంత్యక్రియలు నిర్వహించిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆరోపణలపై బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా స్పందిస్తూ.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు.

తాజాగా జేపీ నడ్డా మాట్లాడుతూ..‘మన్మోహన్‌ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్‌ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించింది. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాం. మన్మోహన్‌ ప్రధానిగా ఉండగా.. సోనియా గాంధీ సూపర్‌ ప్రధానిగా వ్యవహరించి ప్రధాని పదవిని అవమానించారు. ఒక ఆర్డినెన్స్‌ను చించేయడం ద్వారా మన్మోహన్‌ను రాహుల్‌ గాంధీ కూడా అవమానించారు. అదే కాంగ్రెస్‌ ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

ఇదే సమయంలో పీవీ అంశంపై కూడా నడ్డా స్పందించారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ..‘పీవీ నరసింహారావు స్మారకం నిర్మించడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచడానికి కూడా ఆమె అనుమతించలేదు. చివరకు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిర్వహించనీయలేదని ధ్వజమెత్తారు. అలాగే, 2015లో పీవీ కోసం ప్రధాని మోదీ స్మారకం ఏర్పాటు చేశారని, భారత రత్న కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రణబ్‌ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో, ఆయన కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)