టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?
Breaking News
జంగిల్‌రాజ్‌పై ఆగ్రహం.. జగన్ పర్యటనల్లో జనవాహిని
Published on Fri, 02/06/2026 - 11:17
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వపు ఆటవిక పాలన కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. తప్పుడు ప్రచారాలు, దాడులు, అరెస్టులతో ప్రతీకార రాజకీయాలు నడిపిస్తోంది. జనం ఈ జంగిల్‌రాజ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వెంట నడుస్తున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వెళ్లిన ప్రతీ చోటకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కూటమిని నమ్మి మోసపోయామని వాపోతున్నారు. మంచి ప్రభుత్వమంటూ ముంచేస్తోందని, పైగా శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ పోరాటాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది సాధారణంగానే కూటమి ప్రభుత్వానికి సహించడం లేదు. అందుకే జనాలను జగన్ దగ్గరగా వెళ్లకుండా.. శతవిధాల ప్రయత్నిస్తోంది.
మొన్న గుంటూరు.. ఇవాళ ఇబ్రహీంపట్నం.. మొత్తం పోలీసుల ఆంక్షల వలయమే. కేవలం జగన్ వస్తున్నారని.. వైఎస్సార్సీపీ శ్రేణులు తరలి రాకూడదనేది వాళ్ల కూటమి ఆలోచన. కానీ, ఆ కుట్రను భగ్నం చేస్తూ జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎంతలా అంటే.. జగన్‌ను దగ్గరుండి వాళ్లే ముందుకు తీసుకెళ్లేలా!.
జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం వణుకుతోంది. చివరి నిమిషంలో రూట్ మార్చమని నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఆదేశించినంత మాత్రాన పోలీసులు అత్యుత్సహాం ప్రదర్శించడం ఎందుకు?. జగన్ పర్యటనకు జనం స్వచ్ఛందంగా తరలి వస్తారు అని జోగి రమేష్ అన్నారు.
జగన్ పర్యటనకు రూట్‌మ్యాప్ ముందే సమర్పించాం. అయినా చివరి నిమిషంలో కావాలనే రూట్‌మ్యాప్ మార్చమని నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్‌కు వచ్చే జనాదరణను ఆపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ప్లాన్లు వేసినా.. జనాన్ని ఆపలేరు. జగన్ అభిమానుల్ని ఆపే శక్తి ప్రభుత్వానికి లేదు అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
జగన్ పర్యటనకు జనం రాకుండా చేయాలని కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ప్రయోగిస్తోంది. కానీ, అది జరిగే పని కాదు. ఏం జరిగినా.. జగన్ వెంటే జనం ఉంటారు అని జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
Tags : 1
