Breaking News

Bihar: నితీష్‌ కుమార్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ ..

Published on Mon, 06/19/2023 - 19:09

బిహార్‌: బిహార్‌ సీఎం నితీష్ కుమార్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవాం మోర్చా(హెచ్ఏఎమ్‌) ప్రభుత్వానికి తన మద్దుతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంతోష్ సుమన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉపసంహరణ పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు. 

కేబినెట్‌కు గత వారమే రాజీనామా చేసిన మాంఝీ తనయుడు సంతోష్ సుమన్.. నితీష్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తన పార్టీని విలీనం చేయాలని సీఎం బలవంతం చేస్తున్నట్లు ఆరోపించారు. పార్టీ భవిష్యత్తును ఢిల్లీకి వెళ్లి చర్చించనున్నట్లు చెప్పారు. మూడో కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

కాగా నితీష్ కుమార్ స‌ర్కార్‌కు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించిన జిత‌న్ రాం మాంఝీ పార్టీ ఎన్డీయేకు చేరువ‌య్యేందుకు సంకేతాలు పంపింది. తాను మంగళవారం  ఢిల్లీ వెళుతున్నాన‌ని, ఎన్డీయే నుంచి ఆహ్వానం అందితే కాషాయ‌ కూట‌మిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌తిపాద‌న‌నూ కూడా ప‌రిశీలిస్తున్నామ‌ని సుమన్‌ తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశానికి సంబంధించిన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు.

నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న హిందుస్థాన్ స్వామ్ మోర్చా పార్టీ.. గతేడాది బీజేపీని వీడిన నితీష్‌ కుమార్‌కు మద్దతుగా మహాకూటమిలో చేరింది. ప్రస్తుతం బిహార్‌లో 243 సీట్లకు గాను ప్రభుత్వానికి చెందిన కూటమికి 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో పాటు మరో మూడు చిన్న పార్టీలు ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి.

ఇదీ చదవండి:గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. కాంగ్రెస్ ఫైర్.. రూ కోటి నిరాకరణ

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు