Breaking News

Jharkhand: హేమంత్‌ సోరెన్‌ కేబినెట్‌ విస్తరణపై జాప్యమెందుకు?

Published on Tue, 12/03/2024 - 11:41

రాంచీ: జార్ఖండ్‌లో గత వారం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల వెలువడిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం ఘన విజయం సాధించడంతో..జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌(49) గనవంబర్‌ 28న  ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేసి అయిదు రోజులు అవుతున్న కేబినెట్‌ విస్తరణపై మాత్రం జాప్యం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేవని తెలుస్తోంది.

ప్రస్తుతానికి జార్ఖండ్‌ కేబినెట్‌లో సోరెన్‌ ఒక్కరు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ కలిసిగా పోటీచేయడంతో.. మిత్రపక్షాల మధ్య బెర్త్‌ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. 

ఇక జార్ఖండ్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 12 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి సోరెన్‌ మంత్రివర్గం భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఒక్కో పార్టీ గెలిచిన నాలుగు స్థానాలకు గానూ ఒక మంత్రి పదవి లభించింది. ఈ ఫార్ములాతో కాంగ్రెస్‌కు నాలుగు బెర్త్‌లు, సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముఖ్యమంత్రి పదవితో సహా ఏడు స్థానాలు లభించాయి. తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌కు ఒక మంత్రి పదవి లభించింది.

గతంతో పోల్చితే ఈసారి జేఎంఎం నాలుగు సీట్లు అదనంగా గెలుపొంది. దీంతో ఒక మంత్రి పదవికి ఐదు 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనతో కాంగ్రెస్‌కు మంత్రి పదవులు తగ్గే అవకాశం ఉంది. జేఎంఎం గెలుచుకున్న 34 సీట్లతో పోలిస్తే ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఆర్జేడీ ప్రస్తుతం నాలుగు సీట్లు గెలుచుకున్నందున ఒకటి కంటే ఎక్కువ మంత్రి పదవులు ఆశించవచ్చని  తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీ గతసారి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)