Breaking News

జేసీ డైరెక్షన్‌లో తాడిపత్రి ఖాకీల చిల్లర డ్రామా

Published on Wed, 07/16/2025 - 10:02

సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా పతనమయ్యిందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణ. వైఎస్సార్‌సీపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పచ్చి అబద్ధం చెప్పిన విషయం కలెక్టర్‌ కార్యాలయం స్పష్టత ఇవ్వడంతో బయటపడింది. పైగా టీడీపీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి డైరెక్షన్‌లోనే ఇది జరిగిందని సమాచారం.  

ఈ నెల 15వ తేదీన వైఎస్సార్‌సీపీ విస్తృత సమావేశం జరగాల్సి ఉంది. అయితే అదే రోజున మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌, గొట్టిపాటి రవికుమార్‌, ప్రభుత్వ విప్‌ పర్యటిస్తున్నారంటూ పోలీసులు వైఎస్సార్‌సీపీ సమావేశానికి అడ్డుపడ్డారు. పైగా సమావేశం నిర్వహించుకోవడం కుదరదంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి లేఖ రాశారు. సాక్షాత్తూ ఐపీఎస్ అధికారి, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేరుతో లేఖ అందజేశారు. ఈ విజ్ఞప్తితో 18వ తేదీకి సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ వాయిదా వేసింది. తీరా చూస్తే.. 

తాడిపత్రి మండలం వీరాపురంలో జరిగింది సబ్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం. పోనీ దానికి మంత్రుల్లో ఒక్కరైనా వచ్చారా? అంటే అదీ లేదు. కేవలం లోకల్‌ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఈలోపు అసలు 15వ తేదీన మంత్రుల షెడ్యూల్ లేదని కలెక్టరేట్ వర్గాలు స్పష్టం చేశాయి. కేవలం వైఎస్సార్‌సీపీ సమావేశం వాయిదా వేయించేందుకు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ చిల్లర డ్రామాకు తెర తీశారు. ఆయన డైరెక్షన్‌లో తాడిపత్రి పోలీసులు ఈ డ్రామా ఆడినట్లు ఇప్పుడు తేలింది.

ఇదీ చదవండి: నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)