Breaking News

నా కూతురుపై కేసు పెట్టలేదు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Published on Sat, 07/01/2023 - 15:44

సాక్షి, జనగామ జిల్లా: రాజకీయ కుట్రలో తన కుమార్తె తుల్జాభవానిరెడ్డి పావుగా మారిందని జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. మూర్ఖులు, దౌర్భాగ్యులు, అధర్ములు తన బిడ్డను రోడ్డు పాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన కుటుంబ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకుంటామని, చిల్లరగాళ్లకు తగిన గుణపాఠం చెబతానని తెలపారు.

బంగారుతల్లి లాంటి తన కూతురుపై కేసు పెట్టలేదని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. కేవలం తన ప్రజా జీవితానికి ఆటంకం కల్పిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేని వారే తన బిడ్డను తనపై ఉసిగొల్పారన్నారు. అలా చేయడం మంచిది కాదని, వారికే అరిష్టంగా మారుతుందని మండిపడ్డారు. ప్రజలు క్షమించరని, తిప్పికొడతారని పేర్కొన్నారు. తాను ప్రజాసేవకుడిని, ప్రజాసేవలో ఉంటానని.. శక్తి ఉంటే ప్రజా సేవ చేసి ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో గెలువాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్‌ విసిరారు.

కాగా అధికారిక విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారంటూ కుమార్తె తుల్జాభవానీరెడ్డి, అల్లుడు రాహుల్‌రెడ్డిలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జూన్‌ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముత్తిరెడ్డి ఫిర్యాదుపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనగామ, చేర్యాల పోలీసులను శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యే కుమార్తె, అల్లుడికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది.
చదవండి: ఖమ్మంలో బెదిరింపు లేఖ కలకలం.. శవాలు కూడా మిగలవంటూ..

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు