నాగబాబు పర్యటనలో రసాభాసా.. తీవ్ర ఉద్రిక్తత

Published on Fri, 04/04/2025 - 12:08

కాకినాడ, సాక్షి: ఎమ్మెల్సీగా జనసేన నేత కొణిదెల నాగబాబు తొలి అధికారిక ప్రకటన ఉద్రిక్తతకు దారి తీసింది. గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్‌ను శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అయితే ప్రారంభ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ‘‘జై వర్మ’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో.. 

తమ్ముళ్లకు కౌంటర్‌గా జనసైనికులు జై జనసేన అంటూ కౌంటర్‌ నినాదాలు చేశారు. నాగబాబు ప్రారంభ హడావిడిలో ఉండగానే కాసేపు ఆ పోటాపోటీ నినాదాల పర్వం కొనసాగింది. దీంతో ఆయన వాళ్ల వంక ఓ లుక్కేసి.. ఏమీ పట్టనట్లు తన కార్యక్రమంలో మునిగిపోయారు. ఈలోపు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచే ప్రయత్నం చేశారు. 

పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ నెగ్గినప్పటి నుంచి టీడీపీ ఇంఛార్జి వర్మకు రాజకీయ ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో.. ఆ మధ్య వర్మ చేసి, ఆపై డిలీట్‌ చేసిన ఓ పోస్టు తీవ్ర దుమారం రేపింది. ఈలోపు ఈ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ గెలుపునకు ఎవరూ కారణం కాదని.. అలా ఎవరైనా అనుకుంటే వాళ్ల ‘ఖర్మ’ అని నాగబాబు వ్యాఖ్యానించడం దుమారం రేపింది. 

టీడీపీ కార్యకర్తలు, వర్మ అనుచరులు నాగబాబును సోషల్‌ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఈ తరుణంలో నాగబాబు తాజా పర్యటనలో జరిగిన పరిణామం ఇరు వర్గాల మధ్య విబేధాలను మరోసారి బయటపెట్టింది. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)