Breaking News

‘వార్నీ సిన్మా తగలెయ్యా.. ముందు అసెంబ్లీకి రండయ్యా!’

Published on Thu, 09/25/2025 - 12:43

సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై చర్చే లేకుండా.. అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ఏకపక్షంగా, చప్పగా సాగిపోతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలకే(TDP MLAs) బోర్‌ కొట్టిందేమో.. భారీ సంఖ్యలో గైర్హాజరు అవుతున్నారు. ఇవాళ(గురువారం) 114 మంది సభ్యులకుగానూ కేవలం మూడో వంతు హాజరు కాకపోవడం గమనార్హం. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions 2025) సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. తొలి రోజుల్లో కూటమి ఎమ్మెల్యేలు పూర్తి హాజరైనా.. నెమ్మదిగా డుమ్మా కొట్టడం ప్రారంభించారు. ఇందులో టీడీపీ వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఇవాళ సమావేశం ప్రారంభ సమయంలో కేవలం 30 మంది మాత్రమే కనిపించారు. మిగతా రెండు పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో సభ పలుచగా కనిపించింది. 

దీంతో చీఫ్‌ విప్‌, విప్‌లు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రమ్మని బతిమాలారు. దీంతో బలవంతంగా మరో 15 మంది సభకు వచ్చారు. అయితే.. జనసేన ఎమ్మెల్యేలు మాత్రం తాము తమ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమా(Pawan Kalyan OG Cinema)లో బిజీగా ఉన్నామని చెప్పారట. సినిమా తర్వాత చూడొచ్చని.. పరువు పోతుందని బతిమాలి.. వాళ్లను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు.. ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా సభలో ఉండడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే.. సభకు ఎమ్మెల్యేలు ఆలస్యంగా వస్తుండడం, గైర్హాజరు, సభలో వ్యవహరిస్తున్న తీరుపైనా స్పీకర్‌ అయ్యన్న తరచూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది తెలిసిందే.

ఇదీ చదవండి: డర్టీ పాలిటిక్స్‌పై చంద్రబాబు వేదాలు!!

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)