Breaking News

జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టకు..!

Published on Sat, 08/30/2025 - 14:54

సాక్షి, విశాఖపట్నం: ఆర్థికాంశాల కంటే సామాజిక అంశాలే వెనుకబాటుతనానికి కారణమని అంబేద్కర్‌ గ్రహించారని.. అలాంటి వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గతంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పడం తెలిసిందే. అయితే ఆయన పార్టీ వాళ్లేమో.. అంబేద్కర్‌ కంటే పవనే గొప్ప అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. అవును.. 

పవన్‌ కల్యాణ్‌ వైజాగ్‌ పర్యటనలో జనసేన నేతలు మరీ దుర్మార్గంగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ ఫోటో కనిపించకుండా.. దానిపై  పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను అంటించారు. తాటి చెట్ల పాలెం సిగ్నల్ వద్ద ఈ పోస్టర్‌ వెలిసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇంచార్జి పసుపులేని ఉషాకిరణ్‌ పేరిట ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది. 

మహాత్ముల ఫొటోలు.. వాళ్ల కొటేషన్లు అక్కడున్న గోడపై  వరుసగా ఉన్నాయి. అందులో అంబేద్కర్‌ చిత్రాన్ని మాత్రమే జనసేన పోస్టర్‌ కవర్‌ చేసింది. దీంతో ఆ దారి గుండా వెళ్తున్న వాళ్లు అది చూసి.. జనసేన ప్రచార పిచ్చి పరాకాష్టను చేరిందని, తమ ప్రచార పిచ్చి కోసం అంబేద్కర్‌ను అవమానించారంటూ వ్యాఖ్యానించారు. 

ఇటు సోషల్‌ మీడియాలోనూ.. అంబేద్కర్‌ కంటే పవన్‌ గొప్పాడని జనసేన భావిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. పవన్‌ పరువు తీసే పనిలో జనసేనవాళ్లు బిజీగా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.  మరి ఈ చర్యపై మీరెలా స్పందిస్తారు?..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)