Breaking News

కాంగ్రెస్‌కు ఒమర్‌ అబ్దుల్లా షాక్‌!

Published on Sun, 12/15/2024 - 17:04

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల(ఈవీఎంల)పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీపార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) నుంచే గట్టి షాక్‌ తగిలింది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్‌ విమర్శలను జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా తప్పుపట్టారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్‌ మాట్లాడారు. 

ఓడినప్పుడు మాత్రమే ఈవీఎంలను  నిందించడం సరికాదన్నారు. ఓటింగ్‌ విధానంపై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఒమర్‌ సూచించారు. ఎన్నికల్లో ఫలితం ఏదైనా అంగీకరించాలన్నారు. ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే వాటిపై పోరాటం చేయాలన్నారు. అవే ఈవీఎంల సాయంతో 100 మంది సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు, పార్టీ విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఒమర్‌ గుర్తుచేశారు. 

కొన్ని నెలల తర్వాత తాము ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని ఈవీఎంలపై విమర్శలు చేయడం సరికాదనిదని ఒమర్‌ అన్నారు. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదని, ఓటమికి సాకుగా వాటిని చూపించకూడదన్నారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని ఎన్నుకుంటారన్నారు.

గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటికీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇందుకు ఓ ఉదాహరణ అని చెప్పారు. ఇటీవల జరిగిన హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న విషయం​ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)