Breaking News

వాలంటీర్లు వద్దట!.. జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 06/30/2024 - 19:16

సాక్షి, కాకినాడ జిల్లా: వాలంటీర్లపై తమ అసలు రంగును టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. వాలంటీర్ల సేవలు అవసరం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పేశారు. వాలంటీర్లు వద్దని టీడీపీ లేజిస్లేటివ్‌ సమావేశంలో చెబుతా.. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి నియమించుకోవాలన్న జ్యోతుల నెహ్రూ.. సచివాలయ ఉద్యోగులకు కాపలా కుక్కల్లా ఏన్డీఏ కార్యకర్తలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

కాగా, ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్‌ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్‌గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివా­ల­యాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హా­మీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీ­న్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధా­నంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యా­మ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది.
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)