Breaking News

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఎందుకొచ్చిందంటే? : జగ్గారెడ్డి

Published on Tue, 08/27/2024 - 20:39

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డైరెక్షన్‌లోనే బెయిల్ వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కవితకు బెయిల్‌ రావడంపై జగ్గారెడ్డి స్పందించారు.‘‘లిక్కర్ స్కామ్ లో కవిత మెయిన్ విలన్. మోదీ, అమిత్ షా డైరెక్షన్ లోనే కవితకు బెయిల్ వచ్చింది. రాజకీయ చీకటి  ఒప్పందంలో భాగమే కవితకు బెయిల్ వచ్చింది. అదే మద్యం పాలసీ కేసులో  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు..15నెలలు వరకు  సిసోడియకు బెయిల్ ఇవ్వలేదు ..ఐదు నెలలకే కవితకు ఎందుకు బెయిల్ ఇచ్చారు’’ అని ప్రశ్నించారు.

‘కేసీఆర్ రాజకీయంగా కాంగ్రెస్‌ను ఢీకొనలేక బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ,బీఆర్ఎస్ అలయన్స్‌గా పోటీ చేస్తాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోయే భాగంగానే మద్యం పాలసీ కేసులో కవిత జైలు నాటకం’అని వ్యాఖ్యానించారు.

బెయిల్ రాక ముందే మూడు రోజుల నుండి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.తీర్పు వెలువరించక ముందే కేసీఆర్ ,కేటీఆర్,హరీష్ రావు,బెయిల్ వస్తుందని లీక్ ఇస్తున్నారు.కేసీఆర్ కుటుంబంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి.

కవిత బెయిల్ అంశం దేశ రాజకీయాలలో కొత్తగా అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించింది. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులను న్యూట్రల్ చేసి బీజేపీకి ఓటు వేయించారు. ట్రబుల్ షూటర్ అంటున్న హరీష్ రావు ఇలాకాలో బీఆర్ఎస్ మూడవ స్థానంలో ఉంది. మోదీ తన బలం పెంచుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. బీజేపీ వెనుక ఉందనే ధైర్యంతో హరీష్ రావు, కేటీఆర్‌లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)