నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
‘వైఎస్ జగన్ పల్నాడుకు వెళ్తే.. బాబు సర్కార్కి భయమెందుకు?’
Published on Tue, 06/17/2025 - 11:56
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటలను అడ్డుకునే కుట్ర జరుగుతోందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సత్తెనపల్లి వెళ్తే చంద్రబాబు సర్కార్కు ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ ఆయన ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు వైఎస్ జగన్కు ఉందన్నారు.
‘‘స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత మీదే. పొదిలిలో వైఎస్ జగన్కు వచ్చిన జన స్పందన చూసి టీడీపీ ప్రభుత్వం భయపడుతోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. చంద్రబాబు సర్కార్ బ్రిటీష్ చట్టాలను అమలు చేసి వైఎస్సార్సీపీని అణచి వేయాలని చూస్తోంది. 30 యాక్ట్ పేరుతో వైఎస్సార్ సీపీ నేతల పర్యటనలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం
‘‘శాంతియుత నిరసనలు, సమావేశాలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కేసులు పెడతాం, పెట్టిస్తాం అంటూ పోలీసులు బెదిరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని శైలజానాథ్ పేర్కొన్నారు.
Tags : 1