Breaking News

రేవంత్‌ పిండం వ్యాఖ్యలపై మంత్రిజగదీష్‌ రెడ్డి కౌంటర్‌

Published on Wed, 08/09/2023 - 12:27

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ తెలంగాణ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్‌ పాలనకు పిండం పెడతామంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. రాజకీయ కక్షలతో కేసీఆర్‌ ఏనాడు వ్యవహరించలేదని తెలిపారు. పాలించమని ప్రజలు కేసీఆర్‌కు అధికారమిచ్చారని పేర్కొన్నారు. లాంటి నీచమైన మాటలు మాట్లాడమని కేసీఆర్‌ తమకు నేర్పలేదని అన్నారు. 

రేవంత్‌ కాంగ్రెస్‌కు పిండే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి జగదీష్‌ విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వక, నీళ్ళు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టిన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.  ఆయన ప్రతిసారీ గుర్తుచేస్తున్నది వాళ్ల పార్టీ(టీడీపీ) చరిత్రనేనని దుయ్యబట్టారు. దుర్మార్గమైన పార్టీల నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, ఆంధ్ర తొత్తులకు తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన ద్రోహి అని మంత్రి ధ్వజమెత్తారు. క

రెంట్ నీళ్ళు, ఉద్యోగాలు, మత్స్య కార్మికులు,  గొర్ల పెంపకదార్లకు అండగా ఉన్నందుకు కేసీఆర్‌కు పిండం పెడతావా అని రేవంత్‌ను నిలదీశారు. రేవంత్‌ కేవలం కేసీఆర్‌కు మాత్రమే కాదని, తెలంగాణ ‍ ప్రజలకు పిండం పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ అభివృద్ది ఏంటో, ఏం చేస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. నువ్వు, నీ బాస్(చంద్రబాబు) చేసిన కుట్రల నుంచి బయట పడి, చావు అంచుల దాకా వెళ్లి కేసీఆర్‌ తెలంగాణ తీసుకొచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ అభివృద్ధి చేస్తూ, దేశంలోనే నంబర్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. మీ వల్ల దెబ్బ తిన్న ప్రజలను కాపాడింది కేసీఆర్‌. 

జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలాంటి మాటలా మాట్లాడేది?. పైసలు పెట్టీ తెచ్చుకున్న పదవిలో కూర్చొని అహంతో మాట్లాడుతున్నావు. ఎక్కువ ఊహాలోకి వెళ్ళకు రేవంత్. వచ్చే రోజుల్లో ప్రజల నుంచి భంగం తప్పదు. సోయి లేకుండా మాట్లాడకు. ఎవరి కోసం త్యాగం చేసి వచ్చావు. రూ.50 లక్షలతో దొరికి చంద్రబాబును ఖతం చేశావు. కరెంట్ విషయంలో మాట్లాడి కాంగ్రెస్‌ను ఖతం చేశావు. చంద్రబాబును, టీడీపీని తెలంగాణలో ఖతం చేసింది నువ్వే కదా’ అని రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు