Breaking News

Congress: షర్మిలకు మొండి చెయ్యి

Published on Wed, 02/14/2024 - 11:20

అంతన్నారు ఇంతన్నారు.. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ పదవితో బాటు కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తారని, ఇంకా కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని ఊదరగొట్టారు.. చూస్తే చివరకు ఆమెకు ఏమీ లేకుండా పోయింది.

అప్పట్లో ఆమె తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జాతీయ కాంగ్రెసులో విలీనం చేసినప్పుడే ఆమెకు రాజ్యసభ హామీ ఉందని అన్నారు.. కానీ చివరకు ఏం జరిగింది.  దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీనికోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించింది. ఈనెల 15 తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువుంది. కానీ ఈ క్రమంలో కాంగ్రెస్‌ తరఫున షర్మిలకు టిక్కెట్ అయితే దక్కలేదు.

ఒకనాడు యావద్దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడక్కడా మిణుకుమిణుకుమంటూ వెలుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ, హిమాచల్, కర్ణాటకలో మాత్రం అధికారంలో ఉండగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ వంటిచోట్ల చెప్పుకోదగ్గ సీట్లతో ప్రతిపక్షంలో ఉంది. వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తే ఓ పది వరకు సీట్లు కాంగ్రెసుకు రావచ్చని అధిష్టానం అంచనా వేస్తోంది. ఐతే ఈ క్రమంలో విజయ్ మాకెన్ వంటి కొందరు పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ షర్మిల పేరును మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. దీంతో ఆమెకు ఇన్నాళ్లుగా జరిగింది ప్రచారమే తప్ప ఆమెకు ఇంకేం లేదని అంటున్నారు.

ఆమెను కేవలం సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి మీద విమర్శలు.. నిరాధార ఆరోపణలు చేయడం కోసమే వాడుకుంటున్నారు తప్ప అంతకు మించి ప్రాధాన్యం ఉండదు అని.. ఆమె అటు చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీలకు పావుగా ఉపయోగపడడం ఆంధ్రాలో గౌరవాన్ని పోగొట్టుకోవడం మినహా ఆమెకు రాజకీయ కెరీర్ ఉండదు అని వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అంటున్నారు. 

-సిమ్మాదిరప్పన్న

ఇదీ చదవండి: Pawan Kalyan: అనువుగాని చోట..! 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)