Breaking News

‘వన్‌ నేషన్‌ వన్‌ ఫర్టిలైజర్‌’ నినాదంతో ముందుకు..

Published on Fri, 07/28/2023 - 03:58

శామీర్‌పేట్‌: వన్‌ నేషన్‌ వన్‌ ఫర్టిలైజర్‌ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేటలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి కిసాన్‌ సంవృద్ధి కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని, రైతులతో కలిసి పీఎం నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించారు.

అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రధాని గురువారం దేశవ్యాప్తంగా 1.25 లక్షల పీఎంకేఎస్‌కే (ప్రధాన మంత్రి కిసాన్‌ సంవృద్ది కేంద్రం) లను జాతికి అంకితం చేశారన్నారు. ఈ కేంద్రాల్లో వ్యవసాయానికి అవసరమైన ప్రతీ పనిముట్టు, విత్తనాలు, భూసార పరీక్షలు, ఎరువులు లభ్యమవుతాయని, అద్దెకు డ్రోన్‌ స్ప్రేలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

పీఎంకేఎస్‌కే సిబ్బందికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలతో శిక్షణ ఇప్పించి, తద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు. గ్రోమోర్‌ ప్రవేశపెట్టిన డీఏపీ నానో ఒక లీటర్‌ బాటిల్‌.. ఒక బస్తా డీఏపీతో సమానమని, దీన్ని రైతులు సది్వనియోగం చేసుకోవాలని సూచించారు.  

బీమా ఉంటే పరిహారం అందేది... 
తెలంగాణలో అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ ను ప్రజాప్రగతి భవన్‌గా మారుస్తామని కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని, రాష్ట్రంలో బీమా పథకం అమల్లో ఉండి ఉంటే రైతులకు పరిహారం అందేదని చెప్పారు.

ఫామ్‌హౌజ్‌లో, ప్రగతి భవన్‌లో పాలన సాగించే ముఖ్యమంత్రికి రైతుల గోసలు ఎలా తెలుస్తాయని, ప్రధానమంత్రి పంట బీమా పథకాన్ని రా ష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీ శా రు. ధరణి పోర్టల్‌ ద్వారా లేని సమస్యలను సృష్టించి, రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, కల్వకుంట్ల కుటుంబం అంటేనే తడి గుడ్డ తో గొంతుకోసే వారని తీవ్ర అసహనం వ్యక్తం చేశా రు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. 

అరెస్టులకు భయపడేది లేదు 
గజ్వేల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నయా నిజాం తరహాలో ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఇటీవల చోటుచేసుసుకున్న ఘటనలో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ నేత మనోహర్‌ యాదవ్, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ గంగిశెట్టి చందన భర్త రవీందర్‌లను ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి గురువారం పరామర్శించారు. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాగా పరామర్శ సందర్భంలో కిషన్‌రెడ్డి.. రవీందర్‌పై కాషాయ కండువా కప్పడానికి ప్రయతి్నంచగా ఆయన సున్నితంగా వారించారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)