‘నా వ్యాఖ్యల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను’

Published on Wed, 07/29/2026 - 18:31

సాక్షి,ఢిల్లీ: లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం లేదని తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, క్షమాపణలు చెప్పబోమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యనించారు. బుధవారం రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. 

‘విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యకు కేంద్రహోంమంత్రి అమిత్‌ షానే బాధ్యత వహించాలి. పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులను చావబాదారు. పెల్లెట్‌ గన్‌ తగిలి ఓ యువకుడు కన్ను పోవాల్సిన పరిస్థితి వచ్చింది.మహిళలు, మైనర్లపై కూడా దాడులు చేశారు. పోలీసులకు అమిత్‌షా ఆదేశాలైనా ఇచ్చి ఉండాలి.. ఆయనకు తెలియకుండా జరిగుండాలి’అని వ్యాఖ్యానించారు. 

దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీల నిరసనల సందర్భంలో, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల కాల్పులు, లాఠీఛార్జీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 

అమిత్ షా ఆదేశాలు ఇచ్చారనడానికి రాహుల్ గాంధీ దగ్గర ఏవైనా రాతపూర్వక ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని, లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సభకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, అలాంటప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు.  

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)