Breaking News

టీడీపీ చీటింగ్‌: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..

Published on Sat, 05/18/2024 - 07:45

హైదరాబాద్, సాక్షి: పచ్చ మూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగు దేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ.. అదీ రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్‌ చేసుకుంది. మూడు నెలలపాటు గొడ్డు చాకిరీచేయించుకుని.. చివరకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా.. ఈ ఘటన బయటపడింది.

నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు. అందులో invitcus pvt lmtd bpo పేరిట బీపీవో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. టెలికాలర్స్‌ జాబ్స్‌ పేరిట‌ కొందరు స్టూడెంట్స్‌ను నియమించుకున్నారు. అయితే బీపీవో ముసుగుతో.. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్లు. తీరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు.

రూ.13 వేలు ఇస్తామని చెప్పి.. రూ.3 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కొందరు యువకులు ఆ ఆఫీస్‌ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇదేంటని? వాళ్లు నిలదీయడంతో.. టార్గెట్‌ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకులు..   ఆఫీస్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్యాప్‌లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు, బాధితుల తరఫున నిలదీయబోయిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.

టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. కూకట్‌పల్లిలో సైతం  invitcus pvt lmtd ఓ బ్రాంచ్‌ను ఓపెన్‌ చేసి ఇదే మాదిరి అక్కడా కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తేలింది. ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)