Breaking News

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

Published on Wed, 04/24/2024 - 05:44

సాక్షి, నెట్‌వర్క్‌: పల్నా­డు జిల్లా పిడుగురాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామా­జిక వర్గాలకు చెందిన 200 కుటుంబాలు టీడీ­పీని వీడి మంగళవారం గురజాల ఎమ్మె­ల్యే కాసు మహేశ్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి నుంచి టీడీపీకి చెందిన పలువు­రు యువత తెలుగు అకాడమీ చైర్మన్‌ నంద­మూరి లక్ష్మీపార్వతి, మైలవరం ఎ­మ్మె­ల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. విస్సన్నపేట మండల బీజేపీ మాజీ అధ్య­­క్షుడు మీసాల సత్యనారాయణ తిరు­­వూ­రు ఎమ్మె­ల్యే అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కి చెందిన టీడీపీ మైనార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడ టీడీపీ మైనారిటీ సెల్‌ ఉపాధ్యక్షులు షేక్‌ బాజీ ఆధ్వర్యంలో 50 మంది ముస్లీం మైనార్టీ నేతలు, మహిళలు పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రా­మా­నికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బిళ్లు కృష్ణమూర్తి కుమారులైన బిళ్లు బ్రదర్స్‌గా పిలువబడే బిళ్లు నర్సింహరావు, బిళ్లు అన్నవరం, యర్రంశెట్టివారిపాలెం గ్రామం పూతినీడివారిపాలెంలో జనసేన, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యే ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

పాలకొల్లులోని 18­వ వార్డు బెత్లహాంపేటలో మాదిగ సామా­జిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, యలమంచిలి మండలంలోని అడ­విపాలెం పంచాయతీ గగ్గిపర్రుకు చెందిన టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సమ­క్షంలో పార్టీలో చేరారు. భీమవరానికి చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు, 100 మందికిపైగా నాయి బ్రాహ్మణులు, చి­న ఆమిరం, భీమవరంలోని అప్పారా­వు తోట, నరసయ్య అగ్రహా­రం ప్రాంతాలకు చెందిన 50 మంది క్షత్రియులు, భీమవరం 18వ వార్డుకు చెందిన ముస్లిం సోదరులు వార్డు మాజీ కౌన్సిలర్‌ కోడె యుగంధర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ సమక్షంలో వైఎస్సార్‌పీలో చేరారు.

ఏలూరు జిల్లా సీతంపేటలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంపీ కోటగిరి శ్రీధర్‌ సమక్షంలో సీతంపేట జనసేన నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సమక్షంలో గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. నంద్యాలలోని 36వ వార్డు సంజీవనగర్‌ ఏరియా నుంచి 200 కుటుంబాలు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)