Breaking News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌.. రంగంలోకి ముగ్గురు మంత్రులు

Published on Mon, 08/04/2025 - 19:26

సాక్షి, హైద‌రాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీ  ఏడాదిన్నర పాలనకు ‘జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక’ రెఫరెండంగా భావిస్తూ ముందస్తు కార్యాచరణకు దిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్‌ కావడంతో ఈ స్థానాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలతో సంబంధం లేకుండా, అభ్యర్థి ఎంపిక అంశానికి పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా కేవలం పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌లు జూబ్లీహిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా ముగ్గురు రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (jubilee hills bypoll) బాధ్యతలను అప్పగించారు.

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌కు సిట్టింగ్‌ సీటు కావడంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే.. క్షేత్రస్థాయిలో అధికార కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు తీసుకొచ్చేందుకు మంత్రులు  రంగంలోకి దిగారు. సుడిగాలి పర్యటనతో సంక్షేమ, అభివృద్ధి అ్రస్తాలను ప్రయోగిస్తున్నారు. మరోవైపు  పార్టీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు లేకుండా  సమన్వయ సాధన కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఉనికి లేకుండా చేయడంతోపాటు బీజేపీని నిలవరించేందుకు సికిందాబాద్‌ కంటోన్మెంట్‌ తరహాలో జూబ్లీహిల్స్‌ కూడా కాంగ్రెస్‌ ఖాతాలో పడాలన్నదే అధికార కాంగ్రెస్‌ (Congress Party) అన్ని అ్రస్తాలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల బాధ్యతలు 
అధికార కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా అవతరించేందుకు ముందస్తు కసరత్తు చేస్తోంది. నియోజక వర్గాన్ని మూడు విభాగాలుగా విభజించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్‌లకు బాధ్యతలను అప్పగించింది. ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల చొప్పన కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళ్‌రావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో కొంత భాగం.. పొన్నం ప్రభాకర్‌కు యూసఫ్‌గూడ, బోరబండ డివిజన్లు, గడ్డం వివేక్‌ వెంకటస్వామికి షేక్‌పేట రహమత్‌నగర్‌ డివిజన్లను కేటాయించారు. 

మంత్రులకు సహాయంగా ఉండేందుకు ఆరుగురు చొప్పున  మొత్తం 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లకు బాధ్యతలు అప్పగించింది. వారంతా సంబంధిత మంత్రులతో సమావేశమవుతూ ఎన్నికలు పూర్తయ్యే వరకు డివిజన్లపై దృష్టి సారించి ఇక క్షేత్రస్థాయిలో సంక్షేమ, అభివద్ది పధకాల అమలు పర్యవేక్షణ, ప్రచార బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు.

క్షేత్ర స్థాయి పర్యటనలు.. 
మంత్రులు సైతం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నారు. తమకు కేటాయించిన డివిజన్లల్లో అత్యధిక ఓటు బ్యాంకు (Vote Bank) సాధించేందుకు  కసరత్తు చేస్తున్నారు. నియోజవర్గంలోని డివిజన్లలో క్షేత్ర స్థాయి పర్యటనలకు మంత్రులు శ్రీకారం చుట్టారు. బూత్‌ స్థాయి నేతలతో  సమావేశమై ఎన్నికలపై చర్చిస్తున్నారు. 

చ‌ద‌వండి: రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌కు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కౌంట‌ర్‌

ఇటీవల బంజారాహిల్స్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నంతో పాటు పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు ఉన్న అవకాశాలపై చర్చించారు.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై డివిజన్ల వారీగా వ్యవహరించాల్సిన అంశాలపై స్థానిక నేతలకు మంత్రులు తుమ్మల దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు