Breaking News

హేమంత్ సోరెన్ ప్ర‌భుత్వం బ‌ల‌ప‌రీక్ష‌.. అసెంబ్లీలో ఎవ‌రి బ‌లం ఎంత‌?

Published on Mon, 07/08/2024 - 11:00

జార్ఖండ్‌లో కొత్త‌గా కొలువు దీరిన సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం నేడు (జూలై 8) అసెంబ్లీలో బ‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కోనుంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే సోరెన్ త‌న మంత్రివర్గాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్త క్యాబినెట్‌లో సీఎం సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎవ‌రి బ‌లం ఎంత‌?
కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గాలంటే 41 ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు దీంతో సునాయ‌సంగా సోరెన్  గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ)తో కూడిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 45 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా.. బీజేపీకి 24 మంది ఉన్నారు. అధికార కూటమిలో జేఎంఎం 27 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉంది, కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో రెండవ స్థానంలో ఉంది. జార్ఖండ్‌లో ఆర్జేడీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.

ఇద్దరు ఎమ్మెల్యేలు నలిన్ సోరెన్, జోబా మాఝీ ప్ర‌స్తుతం ఎంపీలుగా ఎన్నిక‌వ్వ‌డంతో జేఎంఎం బలం 27కు త‌గ్గింది, అదే విధంగా జామా శాసనసభ్యురాలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు.  ఇక ఇటీవ‌ల జేఎంఎం మరో ఇద్దరు ఎమ్మెల్యేల‌ను (బిషున్‌పూర్ ఎమ్మెల్యే చమ్రా లిండా, బోరియో ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్) పార్టీ నుంచి బహిష్కరించింది.

అదేవిధంగా, జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ బలం 24కి తగ్గింది, పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు.. బగ్మారా నుంచి ధులు మహ్తో, హజారీబాగ్‌కు ప్రాతినిధ్యం వహించిన మనీష్ జైస్వాల్  లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచారు.  ఇక‌ కాంగ్రెస్‌లో చేరిన మండు ఎమ్మెల్యే జైప్రకాష్ భాయ్ పటేల్‌ను కాషాయ పార్టీ బహిష్కరించింది.

కాగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్‌ సోరెన్‌ మూడోసారి ముఖ్య‌మంత్రిపీథాన్ని అధిరోహించిన విష‌యం తెలిసిందే. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిలుపై విడుదలైన హేమంత్‌.. 5 నెలల తర్వాత మళ్లీ జూలై 4న సాయంత్రం జార్ఖండ్ 13వ‌సీఎంగా ప్రమాణం చేశారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

ఇక 2013లో తొలిసారిగా జార్ఖండ్‌కు హేమంత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గురువారం మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)