Breaking News

జార్ఖండ్‌ సీఎంగా ప్రమాణం చేసిన హేమంత్‌ సోరెన్‌

Published on Thu, 07/04/2024 - 17:51

రాంచీ: జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేయించారు. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్‌.. 5 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 

ల్యాండ్‌ స్కాం కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) అధికారులు హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య.. అరెస్ట్‌ కంటే ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్‌ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

ఐదు నెలల తర్వాత.. హేమంత్‌కు హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో జూన్‌ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ తరుణంలో బుధవారం చంపయీ సోరెన్‌ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా సమావేశమై హేమంత్‌ సోరెన్‌ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 

తొలుత జులై 7న ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే ఆలస్యం చేయకుండా ఆయన గవర్నర్‌ను కలిసిన హేమంత్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్‌ అంగీకారం లభించడంతో.. ఇవాళ సాయంత్రం జార్ఖండ్‌ 13వ ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ఆయన ప్రమాణస్వీకారం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)