Breaking News

లోకేష్‌ను మా ముందు హాజరుపర్చండి: ఏపీ హైకోర్టు

Published on Fri, 11/08/2024 - 17:16

సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో ఇవాళ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణ జరిగింది. పిటిషన్ల విచారణ సందర్భంగా.. ఓ ఎస్సై స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేయడం గమనార్హం. తిరుపతి లోకేష్ అనే వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధి కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పిటిషన్‌ వేశారు. ఈ విచారణకు ఎస్సై జానకీ రామయ్య హాజరు కాగా, ఆయన స్టేట్‌మెంట్‌ను కోర్టు నమోదు చేసింది.

‘‘ఐదో తేదీనే 41 నోటీస్ ఇచ్చి లోకేష్‌ను వదిలేశాం. బెయిల్ షూరిటీల విషయంలో ఏడో తారీఖు రావాలని చెప్పాం’’ అని ఎస్సై జానకి రామయ్య కోర్టుకు తెలిపారు. అయితే.. లోకేష్‌ 5వ తేదీన బయటకు వెళ్లి ఇంటికి రాలేదని, పోలీసులు అతన్ని అక్రమంగా నిర్బంధించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో.. లోకేష్‌ను సోమవారం ఉదయం పదిన్నర గంటలకల్లా తమ ముందు హాజరు పర్చాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ ను సీల్డ్ కవర్ లో సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే.. జింకల రామాంజనేయులు కేసులో కూడా సీసీ టీవీ ఫుటేజ్ సమర్పించాలని ఆదేశించింది.

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులైన జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వరరెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి సుధారాణి-వెంకటరెడ్డి దంపతులు, మహమ్మద్ ఖాజాభాషాల‌ను పోలీసులు అక్ర‌మంగా నిర్భందించారు. దీంతో త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ వాళ్ల కుటుంబ సభ్యులు ఆరు హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేశారు.

ఇదీ చదవండి: YSRCP సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్‌.. కీలక ఆదేశాలు జారీ



 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)