Breaking News

జింకల మృతికి కారణమైన వారిపై చర్యలేవీ?: హరీష్‌రావు

Published on Thu, 04/10/2025 - 15:59

సాక్షి, హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నియమ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అన్ని  ఆధారాలతో  క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులతో సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిశామన్నారు. రైతు ఒక్క చెట్టు కొడితే కేసు నమోదు చేస్తున్నారు.. రైతుకు ఒక చట్టం.. రేవంత్ రెడ్డికి ఒక చట్టమా?’’ అంటూ  హరీష్‌రావు ప్రశ్నించారు.

‘‘కంచె చేను మేసినట్టిగా ప్రభుత్వం వేలాది చెట్లు నరికివేసింది. వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టా యాక్ట్ ఉల్లంఘించి ప్రభుత్వం వ్యవహరించింది. మూడు జింకలు చనిపోయాయి. వన్య ప్రాణుల గూడును చెదరగొట్టారు. జింకల మృతికి కారణమైన అధికారులపైన చర్యలేవీ? పర్యావరణ విధ్వoసం జరిగితే అటవీ అధికారులు నిద్ర పోతున్నారా?. ప్రైవేట్‌  భూమి అయినా అందులో చెట్లు పెరిగితే అందులో వన్య ప్రాణులు గూడు ఏర్పాటుచేసుకుంటే అది అటవీ భూమిగా పరిగణిస్తారు. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉంటే.. అందులో చెట్లు ఉంటే అది అటవీ భూమిగానే పరిగణిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కంచ గచ్చిబౌలిలో చెట్లు నాటారు’’ అని హరీష్‌రావు గుర్తు చేశారు.

హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సెలవు దినాలు చూసుకుని మరి జేసీబీలతో చెట్లు నరికివేశారు. కంచ గచ్చి బౌలి భూములు హెచ్‌సీయూ అధీనంలో ఉందని గతంలోనే ఆర్డీవో, కలెక్టర్‌ కలెక్టర్ లేఖ రాశారు. సీఎం రేవంత్ ఈ భూమిని మాడ్యూగేట్ చేసి 10 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పు ఇప్పించిన బ్రోకర్‌కు 169 కోట్ల 83 లక్షలు చెల్లించారు. ఈ  భూములను అమ్మి సీఎం రేవంత్ 40 వేల కోట్లు తేవాలని  సీఎం  రేవంత్  ప్రయత్నం’’ అంటూ హరీష్‌రావు ఆరోపించారు.

సుప్రీoకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతుంది. నిన్న సాయంత్రం టీజీఐఐసీ భూమి అని బోర్టులు ఏర్పాటు చేశారు. కంచ భూముల విధ్వంసంలో  పోలీస్ శాఖ పాత్ర కూడా ఉంది. గతంలో కొత్త సచివాలయం నిర్మించే సమయంలో చెట్లు నరకొద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌కి  వెళ్లిన  రేవంత్‌కు ఇన్ని చెట్లు  నరకొద్దూ అని  తెలియదా?. యూనివర్సిటీ  భూములు తమకే చెందాలని విద్యార్థులు అడిగితే వారిపై కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వం శాశ్వతo కాదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)