Breaking News

Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి

Published on Tue, 10/08/2024 - 07:26

చండీగఢ్‌: హర్యానాలోని మొత్తం 90 లోక్‌సభ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరిగింది. నేడు(మంగళవారం) ఆయా స్థానాల ఫలితాలు వెల్లడికానున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా? లేక బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని సాధిస్తుందా? అనేది నేడు తేలనుంది. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.  అదేవిధంగా బరిలో ఉన్న పలువురు బడా నేతల ఫలితంపై అందరి దృష్టి నిలిచింది.

భూపేంద్ర సింగ్ హుడా
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సీటుపై ఆయనకు గట్టి పట్టు ఉంది. హుడా రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే సీఎం పదవికి ఆయనే బలమైన పోటీదారుగా భావిస్తున్నారు.

నాయబ్ సింగ్ సైనీ
మనోహర్ లాల్ ఖట్టర్‌ను హర్యానా నుండి ఢిల్లీకి పంపిన తరువాత, బీజేపీ నాయబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. ఆయన కురుక్షేత్రలోని లాడ్వా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్‌కు చెందిన మేవా సింగ్‌ పోటీనిస్తున్నారు. గత ఎన్నికల్లో మేవా సింగ్ లాడ్వా స్థానం నుంచి గెలుపొందారు.

అనిల్ విజ్
హర్యానా బీజేపీలో విజ్ కీలక నేతగా గుర్తింపు పొందారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన విజ్ అంబాలా కాంట్‌ అభ్యర్థి. 1967 నుంచి 2019 వరకు పంజాబీ వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు.

దుష్యంత్ చౌతాలా
ఉచానా స్థానం నుంచి జేజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా పోటీ చేస్తున్నారు. గతంలో ఐదేళ్ల పాటు ఆయన బీజేపీ ప్రభుత్వంతో జతకట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల పంపకంపై ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో పొత్తు తెగిపోయింది. 2019లో ఉచానా స్థానం నుంచి దుష్యంత్ చౌతాలా గెలుపొందారు.

వినేష్ ఫోగట్
పారిస్ ఒలింపిక్స్ 2024 నుండి తిరిగి వచ్చిన తరువాత, వినేష్ ఫోగట్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. జులనా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. వినేష్‌పై బీజేపీ తరపున మాజీ పైలట్ యోగేష్ బైరాగి పోటీ చేస్తున్నారు.

సావిత్రి జిందాల్
దేశంలోనే అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తల్లి. సావిత్రి జిందాల్‌  హర్యానాలో మంత్రిగా కూడా పనిచేశారు.

ఇది కూడా చదవండి: కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)