Breaking News

చంద్రబాబు ద‘మనీ’యం

Published on Mon, 01/22/2024 - 05:24

సాక్షి అమలాపురం: లోక్‌ సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి వారసుడు గంటి హరీష్‌ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ దమన నీతికి బలైపో­తున్నారు.  అమలాపురం నుంచి ఎంపీ టికెట్‌ రేసులో ఉన్న హరీష్‌కు డబ్బు లేదనే ఉద్దేశంతో మొండిచేయి చూపేందుకు టీడీపీ అధిష్టానం యత్నిస్తోంది. ఈ విషయంపై అలిగిన హరీష్‌ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో బాలయోగి అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. హరీష్‌ ప్రస్తుతం టీడీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు.

పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ త్రిమెన్‌ కమిటీలోనూ సభ్యునిగా కొనసాగుతున్నారు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని తొలి నుంచీ ఆసక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో హరీష్‌ను ఎంపీగా బరిలోకి దింపారు. 39,996 ఓట్ల తేడాతో హరీష్‌ ఓడిపోయారు. పార్లమెంట్‌ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా హరీష్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్లమెంటు స్థానంలో పోటీ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

అయితే టీడీపీ అధిష్టానం డబ్బు లేదనే ఉద్దేశంతో హరీష్‌ను పక్కన పెట్టేందుకు యత్నిస్తోంది. హరీష్‌కు క్యాడర్‌లో పట్టు లేదని సాకుగా చూపుతోంది. హరీష్‌ మరీ పట్టుబడితే పి.గన్నవరం, లేదా అ­మలాపురం అసెంబ్లీకి పంపించాలని పార్టీ అ­ది­నేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని స­మా­చారం. ఈ విషయాన్ని హరీష్‌కు చెప్పేశారని పా­ర్టీవర్గాలు చెబుతున్నాయి. దీంతో అలిగిన హరీష్‌ వారం పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినా అధి­ష్టానం చలించలేదు. డబ్బు లేనందున హరీష్‌కు ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. 

పాము‘కొనేనా’!
హరీష్‌ స్థానంలో ఇటీవల పార్టీ­లో చేరిన మాజీ ఎంపీ ఏజేవీబీ మõ­ßæశ్వరరావు కుమార్తె, పాము ­సత్యశ్రీని పార్లమెంట్‌కు పంపితే ఎలా ఉంటుంది అనేదానిపై టీడీపీ ఆలోచన చేస్తోంది. ఆమె పార్టీలో కొత్తగా చేరినా.. ఆర్థికంగా స్థితిమంతురాలు కావడంతో అధినేత మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గుంటూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త కూడా అ­మలాపురం ఎంపీ టికెట్‌పై ఆశతో త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్నీ బాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీంతో బాలయోగి అభిమానులు ఆవేదన చెందుతున్నారు.  

‘ఆనంద’రావుకు దుఃఖమేనా!
హరీష్‌ అసెంబ్లీకి వెళ్లేందుకు అంగీకరిస్తే అమలా­పురం, పి. గన్నవరంలో ఒక దానిని ఎంపిక చేసుకోవాలని పార్టీ అధి­ష్టానం సూచించిందని తెలిసింది. ఆయనను అమలాపురం నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా యత్నిస్తున్నట్టు సమాచారం. రాజప్పతోపాటు ఆయన వర్గం హరీష్‌ను ఒప్పించే యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

హరీష్‌ను అమలాపురం అసెంబ్లీ బరిలో నిలపడం ద్వారా ఈ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు చెక్‌ పెట్టాలని రాజప్ప యోచిస్తున్నారు. ఒకప్పుడు తన శిషు్యడైన ఆనందరావు ఎదురు తిరగడంతో గత ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ రాకుండా రాజప్ప చివరి వరకు విఫలయత్నం చేశారు. ఈసారి ఆనందరావుకు ఎలాగైనా సీటు రాకుండా చేయాలని పావులు కదుపుతున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)