Breaking News

కరెంట్‌ బిల్లుల పెంపును వ్యతిరేకించింది కేసీఆరే: హరీష్‌ రావు

Published on Fri, 07/14/2023 - 20:42

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు 3 గంటల కరెంట్ చాలు అనుకుంటూ కుడితిలో పడ్డ ఎలుక మాదిరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నారని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకొని ప్రజాగ్రహానికి గురవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ లేక జనం ఇబ్బందులు పడ్డారని గుర్తుచేసిన హరీష్‌ రావు.. ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అందరికి తెలుసని అన్నారు. ప్రస్తుతం దేశంలో నాణ్య‌మైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మేనని స్ప‌ష్టం చేశారు.

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అంటూ స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఇంత కంటే పెద్ద జోక్‌ ఉండదు. నాటి సీఎం చంద్ర‌బాబు క‌రెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్య‌తిరేకించింది కేసీఆర్‌యే. ఉద్య‌మం పుట్టిందే విద్యుత్‌లో నుంచి అయితే.. కాల్పుల‌కు కేసీఆర్ కార‌ణం అన‌డం స‌రికాదు. విద్యుత్ విష‌యంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమ‌ర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసిన‌ట్టే. 

2000 ఆగష్టు 28న బషీర్‌ బాగ్‌లో కాల్పులు జరిగితే కేసీఆర్‌ రైతు హృదయంతో స్పందించారు. అధికార పార్టీలో కొన‌సాగుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించాల‌ని కోరారు. అదే రోజు కేసీఆర్ డిప్యూటీ స్పీక‌ర్ హోదాలో ఉండి చంద్ర‌బాబుకు లేఖ రాశారు. విద్యుత్ చార్జీలు త‌గ్గించ‌క‌పోతే తెలంగాణ జెండా ఎత్తి పోరాడాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. నాడు చంద్ర‌బాబు రైతుల‌ను కాల్చి చంపితే.. క‌డుపు ర‌గిలి మా రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పి, బిల్లులు త‌గ్గించాల‌ని లేదంటే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని లేఖలో పేర్కొన్నారు. కరెంట్‌ కోసం పోరాడింది కేసీఆర్‌ కాదా. ఆయన మీద అభాండాలు వేస్తున్నారు( ఆగ్రహం వ్యక్తం చేశారు.  

డిప్యూటీ స్పీక‌ర్, కేంద్ర మంత్రి ప‌ద‌వి, ఎంపీ ప‌ద‌వుల‌ను కేసీఆర్‌ గ‌డ్డిపోచ‌ల్లా మాదిరిగా కేసీఆర్ వ‌దిలేశారు. మీరేమో ప‌ద‌వుల కోసం చొక్కాల‌ను మార్చిన‌ట్టు పార్టీల‌ను మారుతున్నారు. కానీ కేసీఆర్ ప్ర‌జ‌ల కోసం ప‌ద‌వుల‌ను వ‌దులుకున్నారు. ఇవాళ కేసీఆర్‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే ప్ర‌జ‌లు స‌హించ‌రు. క‌రెంట్ వ‌స్త‌లేద‌ని అంటున్నారు క‌దా.. డైరెక్ట్ వెళ్లి క‌రెంట్ తీగ‌ల‌ను ప‌ట్టుకుంటే, కరెంట్‌ స్వీచ్‌ బోర్డులో వేలు పెడ్తే తెలుస్తుంది’ అని హరీష్‌ రావు చురకలంటించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)