Breaking News

ఒక్కసారే ఎక్కువ.. రెండోసారి పగటి కలే..

Published on Mon, 09/16/2024 - 06:06

సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారి ప్రభు­త్వం ఏర్పాటు చేసుడే ఎక్కు­వ.. రెండుసార్లు గెలుస్తారని అన­డం పగటి కలలు కనడ­మే’ అని మాజీ మంత్రి హరీ­శ్‌­రా­వు ఎద్దేవా చేశారు. రాజ­స్థా­న్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌­ను గెలిí­³స్తే ఐదేళ్లలోపు ప్రభుత్వాలు పోయాయని వ్యా­ఖ్యానించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం హరీశ్‌­రా­వు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రే­వంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ‘అదృష్టం బాగుంటే ఐదేళ్లు ఉంటావు.

మంచిగా ప్రవర్తించు. ఎక్కడైనా కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారికే పోతుంది. రెండుసార్లు అధికారంలో ఉంటానని పగటి కలలు కనకు. అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్‌ తీస్తున్నావు. సీఎం కుర్చీ గౌరవం తగ్గిస్తున్నావు. రాష్ట్రంలో రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఒకటి వర్షాలతో వచ్చిన వరద అయితే...రెండోది చిల్లర ముఖ్యమంత్రి అబద్ధాల వరద. మోరీల కంపును మించిపోయింది ముఖ్యమంత్రి నోటి కంపు. ప్రభుత్వంలో ఉన్నాననే సోయి..ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నా అనే ఇంగితం లేక మాట్లాడుతున్నాడు.

పదే పదే నా పొడుగును గురించి దుర్భాషలాడుతున్నావు. నేను పొడుగే. తెలంగాణ ఉద్యమం నన్ను మరింత ఎత్తుకు చేర్చింది. నీ బుద్ధి కురుచ. నీ చరిత్ర కురుచ. నీ భాష కురుచ. నీ కురుచతనం వల్ల నీకు కలిగిన ఆత్మనూన్యత వల్ల పదేపదే నా పొడుగు గురించి మాట్లాడుతున్నావు. నేను తాటి చెట్టంత ఎదిగిన. నువ్వు వెంపలి చెట్టంత కూడా ఎదగలే. నిన్ను లిల్లీపుట్‌ అని నేను అనలేనా. సన్నాసి అని నేను అనలేనా.. నా ఎత్తు ఎంత ఉంటే ఎందుకు. ఇప్పటికీ 20 సార్లు మాట్లాడివ్‌ నా ఎత్తు గురించి’అని తీవ్రస్థాయిలో హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

రుణమాఫీ ఎక్కడ అయిందో చెప్పు...
‘రుణమాఫీ పూర్తి చేశా అని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అబద్ధాలు చెప్పినవ్‌. రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తావా? కొండారెడ్డిపల్లి చౌరస్తా లేదా మా సిద్దిపేట వెంకటాపురం పోదామా? వెంకటాపురం గ్రామంలో 122 మంది ఉంటే.. 82 మందికి కాలేదు. రుణమాఫీ విషయంలో సీఎంకు, వ్యవసాయశాఖ మంత్రి మాటల మధ్య తేడాలున్నాయి. రెండు లక్షలపైన మిత్తి ఉంటే కట్టిన వాళ్ల లిస్ట్‌ పంపుతున్నానని, దమ్ముంటే వాళ్లకు మాఫీ చెయ్యి అని ఆ వివరాలు హరీశ్‌రావు వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)