Breaking News

1.52లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

Published on Sun, 05/28/2023 - 02:50

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో 24 వేల ఉద్యోగాలిస్తే...ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొమ్మిదేళ్ల పాలనలో 1.52 లక్షల ఉద్యోగాలిచ్చామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మరో 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని జడ్చర్ల బీజేపీ సభలో హిమాచల్‌ సీఎం సుక్విందర్‌సింగ్‌ సుక్కు అబద్ధాలు మాట్లాడటం సరికాదని..ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని హరీశ్‌రావు హితవు పలికారు.

జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రిని శనివారం ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రసంగించారు. హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణలోకి వలసలు వచ్చి బతుకుతున్నారని, ఎంతోమందికి తెలంగాణ జీవనోపాధిగా మారిందని చెప్పారు.

కాంగ్రెస్, టీడీపీ పాలనలో దేశంలోనే వలసలకు, కరువు కాటకాలకు నిలయంగా మారిన పాలమూరు నేడు పచ్చబడి పసిడి పంటలతో అలరారుతోందన్నారు. రేపో మాపో ‘పాలమూరు’నీళ్లు వచ్చి జడ్చర్లను ముద్దాడబోతున్నాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 20 మెడికల్‌ కాలేజీలు ఉంటే నేడు వాటిని 55కు పెంచామని వెల్లడించారు. తెలంగాణలో మొట్టమొదటి మెడికల్‌ కాలేజీ పాలమూరుకు వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు