Breaking News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా ‘హైడ్రా’

Published on Mon, 08/26/2024 - 06:26

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నా, రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. డైవర్షన్‌ పాలిటిక్స్‌తో మైండ్‌గేమ్‌ ఆడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ‘హైడ్రా’పేరుతో డ్రామా నడుపుతోందని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా రాజకీయ కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యాతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేలా రాజకీయం నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ కండువా కప్పుకోకపోతే ఇబ్బంది పెడతాం.. అన్నట్లుగా రేవంత్‌ తీరు ఉందని మండిపడ్డారు. పటాన్‌చెరు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్‌ కేసులు పెట్టారని, రూ.300 కోట్ల ఫైన్‌ వేసి నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్‌ కండువా కప్పారని అన్నారు. కాంగ్రెస్‌ కండువా కప్పగానే మైనింగ్‌ కేసు అటకెక్కిందని, ఇప్పుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కూడా ఇబ్బందిపెట్టేలా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారని, ఆయన భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారని విమర్శించారు. అధికారం ఉందని రాత్రికి రాత్రే కూల్చడాలు సరికాదన్నారు. రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దవద్దని పేర్కొన్నారు. మంత్రులు రుణమాఫీపై కుంటిసాకులు చెపుతున్నారని, రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయమంటే స్పందించడం లేదని అన్నారు. రేవంత్‌ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో రూ.65 వేల కోట్ల అప్పు చేసిందని, అంటే నెలకు రూ.8,125 కోట్ల చొప్పున వచ్చే ఐదేళ్లలో చేయబోయే అప్పు రూ.4.87 లక్షల కోట్లు అని లెక్కించారు. కాగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 9 సంవత్సరాలలో రూ.4,26,000 కోట్ల అప్పు మాత్రమే చేసిందన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)