Breaking News

రుణమాఫీపై చర్చకు సిద్ధమా?

Published on Fri, 08/23/2024 - 06:26

జనగామ: కాంగ్రెస్‌ తొలుత రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణమాఫీ చేసినట్టు భావిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి తనతో చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏరియాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొన్నారు.

ఎక్కడైనా తేదీ ఖరారు చేసి కబురు పంపిస్తే జనగామ ఎమ్మెల్యే పల్లాను వెంట బెట్టుకుని వస్తామని.. ఆ దమ్ము, ధైర్యం సీఎంకు ఉందా? అని హరీశ్‌ అన్నారు. జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న, వరంగల్‌కు వెళ్లి భద్రకాళి, ములుగు సభలో సమ్మక్క, సారలక్క, భువనగిరికి వెళ్లి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామిపై.. ఇలా ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో పంట రుణమాఫీపై ఒట్టు వేసిన రేవంత్‌.. ఎలక్షన్లు ముగియగానే దైవ ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్, క్యామ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)