Breaking News

సీఎం రేవంత్‌కు హరీష్‌రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Mon, 03/03/2025 - 13:09

హైదరాబాద్‌, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులపై  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్‌ రావు అంటున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో టన్నెల్‌ పనులు ముందుకు కదలేదని రేవంత్‌ చేసిన ఆరోపణలనూ హరీష్‌ ఖండించారు. 

బీఆర్‌ఎస్‌ హయాంలో  SLBC టన్నెల్‌ పనులు జరగలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.  లేకుంటే సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేస్తారా? అని హరీష్‌ రావు సవాల్‌ విసిరారు. మా హయాంలో టన్నెల్‌ పనులు జరిగాయి. 11. కిమీలకు పైగా సొరంగం తవ్వాం.. ఇందుకుగానూ రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.ఈ విషయంలో మేం చర్చకు సిద్ధం అని హరీష్‌ రావు అన్నారు. 

అలాగే.. తన దుబాయ్‌పై పర్యటనపై వస్తున్న  విమర్శలను ఆయన తోసిపుచ్చారు. దుబాయ్‌లో మిత్రుడి కుమార్తె వివాహానికి వెళ్లాను. ఫిబ్రవరి 21న దుబాయ్‌కి వెళ్లే.. 22వ తేదీన ప్రమాదం జరిగింది. దీనిని రాజకీయం చేయడం తగదు అని అన్నారాయన. 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద పది రోజుల కింద సొరంగం పైకప్పు కూలిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం పాలమూరు పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టన్నెల్‌ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఆపై టన్నెల్‌ వద్దకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారాయన.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)