Breaking News

కేసీఆర్‌ది రైతు గుండె.. రేవంత్‌ రెడ్డిది రాతి గుండె

Published on Sat, 10/05/2024 - 05:51

సాక్షి, మహబూబాబాద్‌: ‘తెలంగాణ సాధించిన కేసీఆర్‌.. పదేళ్ల పాలనలో రైతు పక్షపాతిగా ఉన్నారు. ఆయనది రైతుగుండె.. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను మోసగించిన సీఎం రేవంత్‌రెడ్డిది రాతి గుండె’అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అందరికీ రుణమాఫీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్లతో శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో బీఆర్‌ఎస్‌ రైతు మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో హరీశ్‌రావు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కల్ల్లబొల్లి మాటలు చెప్పి, నేనే మొనగాడిని.. రాష్ట్రాన్ని బాగుచేసేది నేనే అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి అసలు స్వ రూపం బయట పడిందన్నారు. ఆయన మొనగాడు కాదు .. మోసగాడని ప్రజలు గ్రహించారని చెప్పారు. 

రుణ మాఫీ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒకతీరు.. మంత్రి తు మ్మల మరోతీరు మాట్లాడి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. సీఎం మాటలు నమ్మిన రైతులు రూ.2 లక్షలకు పైగా ఉన్న అప్పులు చెల్లించారని, రుణమాఫీ అవుతుందని అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి ఇప్పు డు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు సీఎం రేవంత్‌రెడ్డిని, ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదని హరీశ్‌ అన్నారు. హామీల అమలుకు దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్‌గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

మంత్రుల్ని, ఎమ్మెల్యే లను నిలదీయాలని ఆయన పిలుపు నిచ్చారు. కాగా, ధర్నా సందర్భంగా ఓ తొండ తాటికొండ రాజయ్య చొక్కాలోకి వెళ్లడంతో కార్యకర్తలు అప్రమత్తమై దానిని తీసివేశారు. దీంతో కొంతసేపు నవ్వులు విరిశాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)