Breaking News

మోదీ నాయకత్వంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: జీవీఎల్‌ 

Published on Mon, 02/06/2023 - 05:25

డాబాగార్డెన్స్‌/­అల్లిపు­రం (విశాఖ దక్షిణ): ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భార­త­­దేశం 2029–30 నా­టికి ప్రపంచంలోనే అ­తి­­పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాజ్య­సభ సభ్యుడు, ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆదివారం నగరంలోని ఓ హో­టల్లో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆ­య­న పాల్గొని మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్‌ అ­న్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉంద­న్నారు. ప్రపంచంలో 9వ పెద్ద ఆర్థిక వ్య­వస్థగా ఉన్న భారత్‌... మోదీ ప్రభుత్వం వచ్చాక ఐదో స్థానానికి ఎదిగిందన్నారు. ఈ బడ్జెట్‌లో రా­ష్ట్రా­లకు రూ.3.8 లక్షల కోట్లు కేటాయించారని తెలి­పారు. ఏపీకి కేంద్రం రూ.7 వేల కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. బీజేపీ నా­యకులు విష్ణుకుమార్‌­రాజు, లంకా దినకర్, మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

లోకేశ్‌ పాదయాత్రకు స్పందన లేదు
టీడీపీ నాయకుడు లోకేశ్‌ పాదయాత్రకు ప్రజ­ల నుంచి పెద్దగా స్పందన లేదని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం అమరా­వతిలోనే ఉంటుందని, సీఎం క్యాంపు ఆఫీస్‌ రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని, దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండకపోవ­చ్చన్నారు. రాజధానిగా విశాఖను ముందు­గానే నిర్ణయించి ఉంటే ఇంకా బాగుండేదని జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)