Breaking News

Vijayasaireddy: ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?

Published on Thu, 03/13/2025 - 10:47

విశాఖపట్నం, సాక్షి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్సార్‌సీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు(Vijayasai Kotary Comments) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్‌ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్‌ చురకలంటించారు. 

‘‘వైఎస్ జగన్(YS Jagan) కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?. మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది?. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?.

ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండోది వైఎస్సార్‌సీపీ వర్గం. ఇక మూడోది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. గతంలో వైఎస్సార్‌సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా?. ఇదే విధంగా మాట్లాడేవారా?. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా?. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడేమో కోటరీ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. ఆయన తాజా వ్యాఖ్యలు మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది’’ అని  గుడివాడ అమర్నాథ్‌(Gudivada Amarnath) అన్నారు. 

ఒక్క హామీ అమలు చేయలేదు
కూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదు. హామీలు అమలు చేయకపొగా.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు.  నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. కానీ, బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇప్పటిదాకా కాలేదు. జగన్‌ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ఈ సమస్యలపై పోరాటంలో యువత పోరు కార్యక్రమం చేపట్టాం.. అది విజయవంతం అయ్యింది. ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్‌ అన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)