Breaking News

స్టాఫ్‌ నర్సులను భర్తీ చేసింది మేమే.. 

Published on Wed, 01/31/2024 - 03:54

సాక్షి, హైదరాబాద్‌: స్టాఫ్‌ నర్సుల ఉద్యోగ భర్తీ ప్రక్రియను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేస్తే ఇప్పు డు కాంగ్రెస్‌ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట హడావుడి చేస్తున్నారని వైద్యఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రా లు అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’ఉందని ఎద్దేవా చేశారు.

ఈ మేరకు మంగళవారం హరీశ్‌ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్‌ 1 నోటి ఫికేషన్‌ను ఫిబ్రవరి 1న ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్‌.. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి మరల్చేందుకే స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాల జారీ పేరిట హడావుడి చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచి్చన హామీ ప్రకారం ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఎన్నికల కోడ్‌ వల్ల ఆటంకం 
వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది నియామకానికి తామే శ్రీకారం చుట్టామని హరీశ్‌రావు పేర్కొన్నారు. మొత్తంగా 7,094 స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి, 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినా ఎన్నికల కోడ్‌ మూలంగా తుది ఫలితాల విడుదల జరగలేదని వివరించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన నియామకాలను తమ ఘనతగా చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సు పోస్టులను ఉన్నతీకరిస్తూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసినా కాంగ్రెస్‌ నేటికీ పరిగణనలోకి తీసుకోవడం లేదని హరీశ్‌రావు ఆ ప్రకటనలో విమర్శించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)